Former Minister and MLA Kodali Nani said that she has no love for the Telugu Desam Party and is indebted to Junior NTR for the rest of her life | తెలుగుదేశం పార్టీపై తనకు ఏమాత్రం అభిమానం లేదని, జూనియర్ ఎన్టీఆర్‌కు తాను జీవితాంతం రుణపడి ఉంటానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. హరికృష్ణ తనను రాజకీయాల్లోకి తీసుకొస్తే, జూనియర్ తనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించారని చెప్పారు. అమరావతి రైతుల ముసుగులో తారక్‌ను అదేపనిగా తిట్టిస్తున్నారని కొడాలి మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆడుతున్న నాటకాలను ఉత్తరాంధ్ర ప్రజలు చూస్తున్నారని, రాబోయే ఎన్నికల్లోవారిద్దరికీ గుణపాఠం తప్పదన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొట్టేందుకే అమరావతి పేరిట పాదయాత్రలు చేస్తున్నారని విమర్శించారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబుకు రాజకీయ సమాధి కట్టాలని పిలుపునిచ్చారు.
#NTR
#KodaliNani
#TDP
#AndhraPradesh
#JrNTR